సర్కార్ సీజన్ అంటే చాలు వచ్చే గెస్టులు ఎంత ఫేమస్ అవుతారో హోస్ట్ ప్రదీప్ కూడా ప్రతీ వారం ఏదో ఒక విషయంలో సరదాగా, ఫన్నీగా ఆన్సర్స్ ఇస్తూ ఆడియన్స్ హృదయాలను దోచుకుంటూ ఉంటాడు. ఈ వారం సర్కార్ సీజన్ 3 కి ఫస్ట్ టైం బాడ్మింటన్, క్రికెట్ ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళతో గేమ్ ఆడుతూనే మధ్యలో కొన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటాడు. అదే "రియల్ మీ ఆస్క్ మీ ఎనీథింగ్" లో భాగంగా ప్రదీప్ కి చాలా మంది నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి.
అందులో ఒకటి "స్కూల్, కాలేజీ డేస్ లో బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏమిటి" అని అడిగారు ఫాన్స్. " నాకు కాలేజీ, స్కూల్ లైఫ్ బాగా మెమరబుల్..ఎందుకంటే ఆ తర్వాత నేను పెద్దగా చదవలేదు కాబట్టి ఇంకేం గుర్తు లేవు...ఐతే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక ఇన్సిడెంట్ నన్ను పూర్తిగా మార్చేసింది. ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగా ఇండస్ట్రియల్ టూర్ కోసం పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ అని కొన్ని ప్రాంతాలకు వెళ్లాం. స్టూడెంట్స్ అందరం చాలా లాంగ్ జర్నీస్ చేసాం.
రిటర్న్ జర్నీలో వస్తూ ఉన్నాం. అదొక ఎత్తైన కొండ ప్రాంతం. ఘాట్ రోడ్ కూడా కావడంతో మా బస్సు సడెన్ గా బ్రేక్ డౌన్ అయ్యింది. అదే టైంలో మా ఫ్రెండ్ కి హెల్త్ బాగా పాడయ్యింది. అసలే అది అర్ధరాత్రి...ఎవరూ లేరు. అలాంటి హెల్ప్ లెస్ సిట్యుయేషన్ లో ఉన్న మాకు ఆ ఘాట్ రోడ్ మీద ఉన్న చిన్న ఊరు నుంచి ప్రజలంతా తరలి వచ్చారు. వాళ్లంతా కలిసి మా బస్సు రిపేర్ అయ్యేలా చేసి అందులోనే బస్సు లో ఉన్న 40 మందికి ఫుడ్ వండి తినిపించారు. వాళ్ళెవరూ మా దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. ఒకరికి సాయం చేయాలి అంటే వాళ్ళ ముక్కూ ముఖం తెలియక్కర్లేదు...ఈ విషయం నాకెప్పుడూ గుర్తొస్తుంది. వాళ్ళను మేమెవ్వవరం మరచిపోలేము. నా లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం ఇది" అని చెప్పాడు ప్రదీప్. ఈ షో ద్వారా ప్రతీ వారం ఎన్నో ప్రశ్నలకు ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాడు..